VIDEO: అన్నపై తమ్ముడు కత్తితో దాడి..!
W.G: మొగల్తూరు(M) కేపీపాలెంలో అర ఎకరం భూమి వివాదం చివరకు రక్తపాతానికి దారితీసింది. అన్న కందులపాటి వీర వెంకట సూర్యనారాయణపై తమ్ముడు నాగ వెంకట సత్యనారాయణ, మరో వ్యక్తి ఏడుకొండలతో కలిసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈఘటనలో గాయపడిన సూర్యనారాయణ ప్రస్తుతం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.