కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు

కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు

SKLM: కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో సంతబొమ్మాళి పాలేశ్వరం ఆలయం వద్ద ఎస్సై వై.సింహాచలం ఆధ్వర్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసంలో 2వ సోమవారం సందర్భంగా స్థానిక గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో ఈ ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయం కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.