తుఫానులోనూ పింఛన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుధీర్
TPT: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉరందూరు పంచాయతీలో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు. తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం నిర్ణయించిన తేదీకే పింఛన్లు అందేలా చూశామని తెలిపారు. డయాలసిస్ పింఛన్ను రూ.5,000 నుంచి రూ. 10,000కి పెంచడం సీఎం గారి నిబద్ధతకు నిదర్శనమన్నారు.