ఇంటింటికి వెళ్లి పన్ను వసూలు చేస్తున్న ఎంపీడీవో
ఏలూరు: మండుటెండలను లెక్కచేయకుండా శుక్రవారం ఉంగుటూరు మండలంలో మండల స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఉంగుటూరు, బొమ్మిడి, కాగుపాడు గ్రామాలలో ఎంపీడీవో మనోజ్, మండల పరిషత్ సూపరిండెంట్ ఆంజనేయులు, డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబులు ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.