ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టీటీడీ ఈవో

ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: టీటీడీ ఈవో

TPT: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయానికి రాబోయే 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలతో కూడిన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో భక్తుల సంఖ్య, ఆలయ పరిసరాల రూపురేఖలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.