ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్

ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్

PLD: చిలకలూరిపేటలోని రైతు బజార్‌లో మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకంపై మంగళవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పలు షాపుల్లో తనిఖీలు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ వాడిన వ్యాపారులకు జరిమానా విధించారు. ప్లాస్టిక్‌కు బదులుగా జనపనార బ్యాగులను వాడాలని, ఇంటి నుంచి చేతి సంచులను తీసుకురావాలన్నారు.