నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అనకాపల్లి: అచ్యుతాపురం మండలంలో పలు గ్రామాలకు ఇవాళ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనులు చేపడుతున్న కారణంగా ఎలమంచిలి రోడ్డు, రామాలయం ఏరియా, గొల్లలపాలెం, వెదురువాడ, మార్టూరు, దిబ్బపాలెం, జి. ధర్మవరం గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.