VIDEO: తాడేపల్లిలో వైసీపీ ఉగాది వేడుకలు
GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి దంపతులు కార్యక్రమానికి హాజరయ్యారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాతో వచ్చిన జగన్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.