సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కాంగ్రెస్ నాయకులు దూది శ్రీనివాసరెడ్డి బుధవారం పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన తాటికొండ ఉమాకు రూ. 39,500, మల్యాల రాజేశంకు రూ. 20 వేల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.