VIDEO: చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
NLR: కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం తలమంచి కాలువ జాతీయ రహదారి వద్ద చెత్త చెదారంతో నిండిపోయింది. ఈ రహదారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలికి చెత్తాచెదారం కళ్ళలో పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా పనిచేయట్ అధికారులు స్పందించి చెత్తను ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.