ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి

MNCL: చెన్నూరు పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బైక్‌పై పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.