VIDEO: గంగలకుర్రులో బీజేపీ శిక్షణ తరగతులు
కోనసీమ: అంబాజీపేట మండలం గంగలకుర్రులో ఆదివారం దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలో నిరంతరం భాగస్వాములు కావాలని సూచించారు.