'ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలి'
కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మంజూరైన 11,679 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఐకేపీ ద్వారా ఆర్థిక సహాయం, ఆర్డీవోలు, తహశీల్దార్లు ఇసుక సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.