విద్యుత్ లేక వర్ధన్నపేట ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు

విద్యుత్ లేక వర్ధన్నపేట ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్స్‌రే యంత్రాలు, రిపోర్ట్‌లకు సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్‌లు పనిచేయక శనివారం సేవలు నిలిచిపోయాయి. జనరేటర్‌కు మరమ్మతులు చేయకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అధికారులు తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.