పేకాట స్థావరంపై దాడి.. 11 మంది అరెస్ట్
W.G: భీమవరం 26 వార్డులో పేకాట స్థావరంపై బుధవారం ఎస్సై బి.వై. కిరణ్ కుమార్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వారి నుంచి రూ. 77,660 స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట, కోడిపందేలు, గుండాట ఆడినా.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠినంగా శిక్షిస్తామని కిరణ్ కుమార్ హెచ్చరించారు.