VIDEO:పాలకుర్తి క్షేత్రంలో భక్తుల కోలాహలం
JN: పాలకుర్తి స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. సోమవారం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు,అ భిషేకాల్లో పాల్గొన్నారు.