VIDEO: 'అగ్ని ప్రమాద నివారణ చర్యలను పాటించాలి'
KDP: ఆస్పత్రులు, కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఫైర్ అధికారి బసివిరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రొద్దుటూరులో ఇటీవల 50 మందికి నోటీసులు ఇచ్చామని ఇందులో 31 ఆస్పత్రులు, 13 విద్యాసంస్థలు, 6 కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య భవనాలు ఉన్నాయని తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.