టెక్స్ టైల్స్ పార్క్ స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలో రేపు ప్రారంభం కానున్న టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపన స్థలాన్ని సబ్-కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేపు పార్క్ ప్రారంభానికి మంత్రి టీజీ భరత్ హాజరుకానున్నట్లు తెలిపారు.ఇందులో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.