నార్త్ జోన్ ఏరియాను పరిశీలించిన కమిషనర్

నార్త్ జోన్ ఏరియాను పరిశీలించిన కమిషనర్

KDP: కడప నగరంలోని నార్త్ జోన్ ఏరియాను బుధవారం ఉదయం కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రధాన రహదారులపై చెత్తను సమయానికి తొలగిస్తున్నారా లేదా అన్న విషయాన్ని స్వయంగా పరిశీలించారు. వినాయక నిమర్జన ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు వెంటనే తొలగించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.