'నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

BPT: విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతున్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.