'అత్యవసర చర్యలకు సిద్ధం'

W.G: ఎర్రకాలువ వరద ప్రవాహం తాడేపల్లిగూడెం మండలం మాధవరం కాజ్ వే వద్ద తగ్గుముఖం పట్టింది. ఆదివారం నందమూరు అక్విడెక్టు వద్ద 28.9 అడుగులుగా ఉన్న వరద సోమవారం సాయంత్రానికి 25 అడుగులకు చేరినట్లు తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్ తెలిపారు. మాధవరం కాజ్ వే వద్ద 1అడుగు మేర వరద ప్రవాహం తగ్గిందన్నారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదన్నారు.