తాటిపాములలో ఘనంగా సీతారామ కళ్యాణం
వనపర్తి జిల్లా తాటిపాములలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష మధు, ఉపసర్పంచ్ కూర్మన్న తదితరులు పాల్గొన్నారు.