మాధవరం-1లో పారిశుద్ధ్య పనులు

మాధవరం-1లో పారిశుద్ధ్య పనులు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి చేపూరి లక్ష్మీనరసయ్య పారిశుద్ధ్య కార్మికులచే రోడ్డు పక్కన ఉన్న కాలువలో చెత్తాచెదారం తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అలాగే ఇంటింటా చెత్త సేకరించి తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.