గుబ్బలమ్మ జాతర మహోత్సవాలు షురూ

గుబ్బలమ్మ జాతర మహోత్సవాలు షురూ

తూర్పుగోదావరి: గోకవరం మాతృశ్రీ గుబ్బలమ్మ తల్లి జాతర మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించునున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు కొన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సుమారు లక్ష మంది వరకు భక్తులు అమ్మ వారిని దర్శించే అవకాశం ఉందన్నారు.