ఖరీదైన కారులో కూల్ వాటర్ పంపిణీ

ఖరీదైన కారులో కూల్ వాటర్ పంపిణీ

HNK: సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు శంకర్, లొకేష్ అనే ఇద్దరు మిత్రులు చల్లని మంచినీటిని అందించారు. మండుటెండలో ఖరీదైన కారు వెనుక కూల్ వాటర్ క్యాన్లను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చారు. ఈ సేవా కార్యక్రమం అందరి మనసులను ఆకట్టుకుంది.