'రోడ్డుపై నీరు నిల్వ లేకుండా కాలువల్లోకి పంపాలి'

'రోడ్డుపై నీరు నిల్వ లేకుండా కాలువల్లోకి పంపాలి'

VZM: రోడ్డుపై నీరు నిల్వ లేకుండా కాలువాలలోకి వెళ్లేలా చూడాలని శానిటేషన్ సిబ్బందిని బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పూల్‌ బాగ్‌ రోడ్డులో పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కనున్న మట్టి దిబ్బలను వెంటనే తొలగించాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లొ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.