కొయ్యలగూడెం చిన్నారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం

కొయ్యలగూడెం చిన్నారికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామానికి చెందిన పనసకాయల హర్షిత మాక్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం పట్ల టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమెను అభినందించి సత్కరించారు. అలాగే ఇటీవల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన వారందరికీ ఈనెల 14న బాలల దినోత్సవం సందర్భంగా సత్కరించడం జరుగుతుందని అన్నారు.