రక్తదాన శిబిరంలో పాల్గొన్న డీఎస్పీ

రక్తదాన శిబిరంలో పాల్గొన్న డీఎస్పీ

NDL: బనగానపల్లె పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీసులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తం ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారిని డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.