'ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి'

'ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి'

KMM: దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని నగరంలోని కొమరయ్య విగ్రహానికి అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటంలో వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమరయ్య చిరస్థాయిగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.