శాలిగౌరారం విలేకరి వెంకన్న కన్నుమూత
NLG: శాలిగౌరారం మండల విలేకరి తాళ్లూరి వెంకన్న(45) గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు దశాబ్దాలుగా విలేకరిగా సేవలందించిన వెంకన్న.. ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల మండల ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం తెలిపారు.