మొగల్తూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్
W.G: వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మొగల్తూరు (M) పేరుపాలెం సౌత్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు (75) అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై. నాగలక్ష్మి తెలిపారు.