కర్నూలు కమిషనర్‌గా ఓబులేసు

కర్నూలు కమిషనర్‌గా ఓబులేసు

కర్నూలు నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా చల్లా ఓబులేసు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక కార్యాలయంలో దస్త్రాలపై సంతకాలు చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అధికారులు, ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విభాగాధిపతులతో సమావేశమై నగర సేవలు మెరుగుపర్చాలని సూచించారు.