భవన నిర్మాణ కార్మికులకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి
కోనసీమ: మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో నమోదైన భవన నిర్మాణ కార్మికులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు పాసుబుక్ జెరాక్స్‌లను మండపేట కార్మిక శాఖ కార్యాలయానికి అందజేసి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని సహాయ కార్మిక అధికారి కాశి శివ నాగ మల్లేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆధార్ సీడింగ్ జరగని యెడల సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని హెచ్చరించారు.