బస్సులు బంద్.. మెట్రో గుడ్ న్యూస్
HYD: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో ఒక్కసారి మెట్రోలో రద్దీ పెరిగింది. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో, నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకు ఓ మెట్రో సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.