VIDEO: 'రైతుల పరిస్థితి దారుణంగా ఉంది'
SKLM: కూటమి ప్రభుత్వ విధానాలతో రైతులు నష్టపోతున్నారని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. మొక్కజొన్న పండించిన రైతులకు సరైన గిట్టుబాటు ధరను కల్పించడంలో వ్యవసాయ శాఖ మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులు పడే బాధలను తెలుసుకొని, రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర అందించాలని ఆయన కోరారు.