'గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలి'
ASR: డుంబ్రిగుడ మండలంలోని కండ్రూం పంచాయతీలో బుధవారం అరకు సీఐ ఎల్. హిమగిరి, డుంబ్రిగుడ ఎస్సై కే. పాపినాయుడు పర్యటించారు. స్థానిక సర్పంచ్ హరి, ఎంపీటీసీ ఆనంద్, పంచాయతీ ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఎవరైనా గంజాయి సాగుకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.