రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

MNCL: జన్నారం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సింగరాయిపేట గ్రామానికి చెందిన అడాయి మారుతి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. వీరు కూలీకి వెళ్తున్న సందర్భంలో చింతగూడ, మహమ్మదాబాద్ గ్రామాల మధ్య ఇవాళ ఉదయం లారీ, బైక్ ఢీకొన్నాయి. గాయపడ్డ వ్యక్తిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.