'రహదారి విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి'
BDK: అశ్వరావుపేట మండలంలో సెంట్రల్ లైటింగ్ పనులు, రహదారి విస్తరణ పనులు నత్త నడకన సాగుతున్నాయని జనసేన పార్టీ నాయకులు డేగల రాము విమర్శించారు. నిత్యం రద్దీగా ఉండే వాహనాలతో రవాణా రహదారులని దుమ్ము ధూళితో నిండిపోతున్నాయని, అధికారులు వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్లు అక్కడక్కడ చల్లుతూ ఏదో చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.