భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు

భక్తిశ్రద్ధలతో స్వామివారి షంషేర్ ఊరేగింపు

ATP: గుత్తి కొండపై వెలసిన హజరత్ సయ్యద్ షా వలి భాషా ఖాద్రి రహమతుల్లా అలైహి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం షంషీర్‌ను భక్తిశ్రద్ధలతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా స్వామివారి గుర్రాన్ని ప్రత్యేకంగా అలంకరించి షంషీర్‌ను మేళతాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చక్కెర చదివింపులు నిర్వహించారు.