VIDEO: అవినీతి ఆరోపణల నేపథ్యలో ఏసీబీదాడులు
KMR: కామారెడ్డి మున్సిపల్ కొత్త పాలకవర్గం ఏర్పడి నెల రోజులు కూడా గడవకముందే మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరగడం కలకలం రేపుతోంది. మున్సిపల్ అధికారులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు జరగడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడిన అధికారులను వెంటనే తొలగించి నూతన సిబ్బందిని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.