ఈనెల 3న ఉచిత వైద్యశిబిరం
కృష్ణా: ఘంటసాల విశ్వేశ్వర స్వామి కల్యాణ మండపంలో ఈనెల 3వ తేదీన ఉచిత వైద్యశిబిరం నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్చ ఘంటసాల, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సంయుక్తంగా నిర్వహించనున్నారు. నేత్ర వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరానికి విచ్చేయనున్నట్లు ఆసుపత్రి సీనియర్ జనరల్ మేనేజర్ జ్యేష్ఠ రాజశేఖర్ పేర్కొన్నారు.