ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
ప్రకాశం: టంగుటూరులోని గల టోల్ ప్లాజా సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున జరిగింది. టోల్ ప్లాజా సమీపంలోకి బైక్ రాగానే, అటువైపుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న వ్యక్తి రహదారిపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.