రోడ్డు ప్రమాదం.. కందుకూరు వాసికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. కందుకూరు వాసికి తీవ్ర గాయాలు

RR: టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మసిటీ PS పరిధిలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాలు.. కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామానికి చెందిన గండికోట యాదయ్య అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా టిప్పర్ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.