గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ
KMM: బోనకల్ మండలం రావినూతల గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భుక్యా భద్రు నాయక్ నిన్న రాత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ స్థానికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ పథకాల గురించి వివరించి తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.