పుతిన్‌తో విందుకు శశిథరూర్‌కు ఆహ్వానం
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఈరోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌కు ఆహ్వానం అందింది. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకే శశిథరూర్‌కు ఆహ్వానం అందినట్లు వారు చర్చించుకుంటున్నారు.