పెన్షన్ల పంపిణీలో నిష్పక్షపాత పాటించాలి: MPDO
NTR: నందిగామ మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఆర్.వి.ఎస్. ప్రసాదరావు వృద్ధాప్య, వితంతు పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. పింఛన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతత పాటించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.