VIDEO: ముక్తేశ్వరంలో ఎస్టీయూ కౌన్సిల్ సమావేశం
కోనసీమ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్టీయూ 79వ వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జెండా ఆవిష్కరించారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. దీనిపై అందరూ ఐక్యంగా పోరాడాలని తెలిపారు. ఎస్టీయూను మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు.