తుమ్మడంలో ప్రజా పాలన గ్రామసభ నిర్వహణ
NLG: తుమ్మడంలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' గ్రామ సభ జరిగింది. సర్పంచ్ బుర్రి వెంకటేశ్వర్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. భూమి, తాగునీరు, రేషన్ కార్డులు, గృహజ్యోతి పథకాల సమస్యలపై ప్రజలు మొరపెట్టుకున్నారు. పథకాల అమలులో పారదర్శకత పాటిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సభలో ఎంపీవో, జీపీవో, గ్రామస్థులు పాల్గొన్నారు.