మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌కు మంత్రి సుభాష్ పరామర్శ

మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌కు మంత్రి సుభాష్ పరామర్శ

కోనసీమ: రాజోలు మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ కేతా వెంకటలక్ష్మిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను తాటిపాక గ్రామంలోని స్వగృహానికి వెళ్లి కలుసుకుని, ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ఆమెకు ధైర్యం చెప్పారు.