'వైసీపీ నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు'

'వైసీపీ నేతలపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు'

ELR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై కక్షపూరిత కేసులు పెడుతున్నారని, వైసీపీ నాయకులు ఇవాళ చింతలపూడి కార్యాలయంలో జరిగిన సమావేశంలో విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌పై కేసులు పెట్టడాన్ని ఖండించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు 1975లో వచ్చిన ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నాయని పలువురు నేతలు ఆరోపించారు.